బిగ్ బాస్ ఇంట్లో రెండో వారం గొడవలతోనే ప్రారంభమైంది. మొదటి వారంలో ఓ ఎలిమినేషన్ జరిగింది. సరయు బయటకువెళ్లింది. ఇక సోమవారం రోజు నామినేషన్ ప్రక్రియ జరగగా, ఈ ప్రక్రియలో హౌజ్‌మేట్స్ ఉగ్రరూపం చూపించారు. తమ మనసులో ఉన్న కారణాలు చెబుతూ ముఖానికి రంగు పూసి మరీ నామినేట్ చేశారు. నక్క వర్సెస్ గద్ద టీమ్ అనే టాస్క్‌లో భాగంగా హౌజ్‌మేట్స్‌ని రెండు టీంలుగా విడదీసిన బిగ్ బాస్ ..నక్క టీములో ఉమాదేవి, లహరి, రవి, జెస్సీ, మానస్, సన్నీ, కాజల్, శ్వేత, నటరాజ్ ఉండగా; గద్ద టీములో లోబో, యానీ మాస్టర్, శ్రీరామ్, ప్రియ, హమీదా, విశ్వ, సిరి, షణ్ముఖ్, ప్రియాంకలని ఉంచారు.
ఈ టాస్క్‌లో ట్విస్ట్ ఏంటంటే హౌజ్‌మేట్స్ వాళ్ల టీమ్‌లో వాళ్లని కాకుండా వేరే టీమ్‌లో ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. సిరి కెప్టెన్ కావడంతో ఆమెను ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు. కెప్టెన్ అయిన సిరి.. మొదటగా సిరి.. ఉమాదేవిని, నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేసింది. నటరాజ్ మాస్టర్.. ప్రియ , ప్రియాంక సింగ్‌ను నామినేట్ చేశాడు. అనీ మాస్టర్.. ఉమాదేవి, కాజల్‌ను; సన్నీ.. ప్రియను, ప్రియాంక సింగ్‌ను నామినేట్ చేశాడు. ప్రియాంక.. నటరాజ్ మాస్టర్‌ను, సన్నీని నామినేట్ చేసింది. మానస్.. లోబోను , ప్రియను నామినేట్ చేశాడు. విశ్వ.. ఉమాదేవిని, కాజల్‌ను నామినేట్ చేశాడు. లహరి.. హమీదా, యానీ మాస్టర్‌ను; హమీదా.. లహరి, శ్వేతను నామినేట్ చేశారు. జెస్సీ.. శ్రీరామచంద్ర, లోబో శ్రీరామచంద్ర.. నటరాజ్, కాజల్; యాంకర్ రవి.. ప్రియాంక, శ్రీరామచంద్రలను నామినేట్ చేశారు.
నామినేషన్ ప్రక్రియ ముగిసే సమయానికి నక్క టీమ్‌లో నుంచి ఉమా, నటరాజ్, కాజల్, గద్ద టీమ్‌లో నుంచి లోబో, ప్రియాంక, యానీ, ప్రియ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ వెల్లడించాడు. చివరకు రెండో వారంలో ఉమ, నటరాజ్, కాజల్, లోబో, ప్రియాంక, అనీ మాస్టర్, ప్రియలు నామినేట్ అయ్యారు.