మెదడు చురుగ్గా ఉండాలంటే..!

418
brain
- Advertisement -

మెదడు పూర్తి ఆరోగ్యంగా ఉండి, సమర్థవంతంగా పనిచేస్తే మన ఆలోచనా శక్తి, విశ్లేషణా సామర్థ్యం పెరుగుతాయి. ఏకాగ్రత కూడా సమకూరుతుంది. కానీ ఎప్పుడూ ఏదో పనిలో నిమగ్నమై ఉంటాం. ఏదో ఆలోచిస్తుంటాం. కొన్నిసార్లు ఎంత ఆలోచించినా ఏ మాత్రం ఏకాగ్రత కుదరదు. దీనికి కారణం మెదడు సామర్థ్యం మందగిస్తుండడమే. మెదడు పనితీరు సమర్థవంతంగా ఉండలంటే ఈ క్రింది వాటిని పక్కనపెట్టాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

ఎక్కువగా ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయని, దీనివల్ల మెదడుతోపాటు శరీరంలోని అన్ని అవయవాలపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఒకేసారి ఎక్కువగా ఆహారాన్ని తీసుకోకుండా ఎక్కువసార్లు కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.

బ్రేక్ ఫాస్ట్ మిస్ చేయడం, రాత్రి ఆలస్యంగా పడుకోవడం,ఎక్కువగా తీపి ఉన్న పదార్ధాలు తీసుకోవడం,ఉదయాన్నే ఎక్కువ సేపు పడుకోవడం, టీవీ లేదా కంప్యూటర్ చూస్తు అన్నం తినడం, టోపి లేదా స్కార్ఫ్, సాక్సు వేసుకుని పడుకోవడం, మూత్రాన్ని ఆపుకోవడం వంటివి చేయకూడదు.

Also Read:Gold Price:లేటెస్ట్ ధరలివే

ధూమపానం, ఆల్కాహాల్ వంటి అలవాట్ల కారణంగా.. శరీరంలో రక్తనాళాలు దెబ్బతినడం, హానికర రసాయనాలు చేరడం, అవి మెదడు పనితీరును దెబ్బతీయడం జరుగుతుంది. అందువల్ల పొగతాగడానికి, ఆల్కాహాల్ కు దూరంగా ఉండాలి.

 

- Advertisement -