66 వేల మందికి అమెరికా పౌరసత్వం

21
- Advertisement -

66 వేల మంది భారతీయులు అమెరికా పౌరసత్వం పొందారు.దీంతో విదేశాల్లో పుట్టి అమెరికా పౌరసత్వం పొందిన మొత్తం భారతీయుల సంఖ్య 28,31,330కి చేరింది. ఇక అమెరికా పౌరసత్వం పొందిన విదేశీయుల్లో మెక్సికో తొలి స్థానంలో ఉంది.

అమెరికా పౌరసత్వం ఉన్న విదేశీయుల్లో మెక్సికన్లు 1,06,38,429 మంది ఉన్నారు. రెండో స్థానంలో భారత్ ఉండగా తర్వాతి స్థానంలో ఫిలిప్పీన్స్, క్యూబా, డోమినికన్ రిపబ్లిక్, వియత్నాం, చైనీయులు ఉన్నారు.

అమెరికాలోని విదేశీయుల్లో దాదాపు 53 శాతం మంది ఆ దేశ పౌరసత్వం కలిగిఉన్నారు. గ్రీన్ కార్డు ఉన్న 2,90,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం పొందే అర్హత ఉందని ప్రభుత్వ గణాంకాలు తేల్చాయి.

Also Read:మందుబాబులకు షాక్ న్యూస్..

- Advertisement -