కరోనా వైరస్ ప్రభవం వలన ఇటలీలోని రోమ్ విమానాశ్రయంలో 66 మంది తెలుగు విద్యార్థులు చిక్కుకున్నారు. ఇందులో హైదరాబాద్ నగరం చెందిన 26 మంది విద్యార్థులు ఉన్నారు. కరోనా కోరలు చాచిన ఇటలీ నుంచి బయటపడేందుకు వీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. స్వదేశానికి వచ్చేందుకు అటు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ కానీ, ఇటు ఎయిరిండియా కానీ వారికి బోర్డింగ్ పాస్‌లు ఇవ్వకపోవడంతో విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. విద్యార్తులు ఎలాగైనా తమను భారత్ కు తీసుకుపోవలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
కరోనా బాధిత దేశాల నుంచి వచ్చేవారు వైరస్ సోకలేదని ధ్రువీకరణ పత్రం సమర్పిస్తేనే దేశంలోకి అనుమతిస్తామన్న భారత ప్రభుత్వ నిబంధన కారణంగా వారికి బోర్డింగ్ పాసులు ఇచ్చేందుకు విమానయాన సంస్థలు నిరాకరిస్తున్నాయి. వసతి, భోజన సదుపాయం లేకుండా విమానాశ్రయంలో ఇబ్బంది పడుతున్న తమను ఆదుకోవాలని, ప్రధాని మోదీ స్పందించి తమను స్వదేశానికి రప్పించే చర్యలు తీసుకోవాలని వారు వేడుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఈ విషయంపై మంత్రి కేటీఆర్.. విదేశాంగ శాఖ మంత్రి జయిశంకర్ ,ఇండియన్ ఇటలీ ఎంబసీ కి ట్విట్ చేశారు.
Request Hon’ble EAM @DrSJaishankar Ji to direct Indian embassy officials @IndiainItaly and help the stranded Indians https://t.co/LR4pEcNjRD
— KTR (@KTRTRS) March 12, 2020