ఇరాన్‌లో ఘోర ప్రమాదం..66 మంది మృతి..

207
66 killed in plane crash
- Advertisement -

ఇరాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం (ఫిబ్రవరి-18) టెహరాన్ నుంచి యాసుజ్ వెళ్తున్న ఓ విమానం మధ్య ఇరాన్‌లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 66 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి సహా 60 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.

ఇరాన్‌కు చెందిన సెమీ ప్రైవేట్ విమానయాన సంస్థ ‘ఎన్ అసమన్ ఏయిర్‌లైన్స్’కు చెందిన ఏటీఆర్ 72 విమానం ఆ దేశ రాజధాని టెహ్రాన్‌కు 780 కి.మీ. దూరంలో కుప్పకూలిపోయింది.

66 killed in plane crash

టేకాఫ్‌ అయిన కొద్ది సమయానికే రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఇరాన్‌ స్టేట్‌ ఎమర్జెన్సీ సర్వీసెస్‌.. విమానం కోసం వెతుకులాట ప్రారంభించింది. ఇసఫాన్‌ ప్రావిన్స్‌కు దక్షిణాన ఉన్న జాగ్రోస్‌ పర్వత ప్రాంతంలో విమానం కుప్పకూలిపోయినట్లు తెలిసింది.

రాజధాని టెహ్రాన్‌ నుంచి యాసూజ్‌ నగరానికి వెళ్తున్న విమానం జాగ్రోస్‌ పర్వతాల్లో 440 మీ. ఎత్తులో కుప్పకూలింది. మంచు ఎక్కువగా కురుస్తుండటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. మంచు ప్రభావం వల్ల సహాయ చర్యలకు కూడా విఘాతం ఏర్పడింది. సహాయ చర్యలకు సంబంధించిన విమానాలు ఘటనాస్థలి చేరలేని పరిస్థితి ఉంది. హిమపాతం కారణంగా ఇటీవలే రష్యాకు చెందిన ఓ విమానం కుప్పకూలిన ఘటనలో 71 మంది మృత్యువాతపడ్డ సంగతి తెలిసిందే.

- Advertisement -