రాంచరణ్, ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా కథ విషయంలో అనేక వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా కథ గురించి స్పందించారు మెగా పవర్ స్టార్ రాంచరణ్.
ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. రాంమోజీ ఫిల్మ్ సిటీలో ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇక చరణ్ విషయానికొస్తే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి సినిమాలు అయిపోయిన వెంటనే రాజమౌళి సినిమా పట్లాలెక్కనుంది. ఇక వీరిద్దరు చేయబోయే మల్టీస్టారర్ చిత్రం గురించి వస్తున్న వార్తలను కొట్టిపారేస్తూ..ఈ చిత్రంలో తాను ఎన్టీఆర్ అన్నదమ్ములుగా కనిపించడం, బాక్సింగ్ నేపథ్యం ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని స్పష్టం చేశాడు. అసలు కథ వేరే ఉందనీ చెప్పాడు.