నూతన దంపతులకు సీఎం కేసీఆర్‌ సర్‌ఫ్రైజ్‌

238
cm kcr marriage
- Advertisement -

ఎవరి పెళ్లికైనా తాము అభిమానించే నటుడో, హీరోనే వస్తేనే చిన్నగా సంబుర పడుతర… ఎగిరి గంతేస్తారు.. అలాంటిది ఎటువంటి ఆహ్వానం లేకపోయినా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే వస్తే ఆ దంపతుల ఆనందం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.  కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన కావ్య, మనోహర్ లు ఇవాళ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరిరువురి జీవితాల్లో మరిచిపోలేని ఈ రోజుకు మరొక ప్రత్యేకత కలిసివచ్చి వారి సంతోషాన్ని రెట్టింపు చేసింది.

cm kcr marriage

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతుబంధు పథకాన్ని ప్రారంభించే నిమిత్తం సీఎం కేసీఆర్ ధర్మరాజుపల్లికి వెళ్తుండగా కరీంనగర్-హుజురాబాద్ రహదారిపై గల తాడికల్ గ్రామంలో జరుగుతున్న ఓ వివాహ వేడుకను చూశారు. వెంటనే తన కాన్వాయ్ ఆపారు. బస్సు దిగారు. సీఎం సడన్ గా బస్సు దిగటంతో భద్రతా సిబ్బంది అంతా అయోమయానికి గురయ్యారు. బస్సు దిగిన కేసీఆర్ నేరుగా పెళ్లి మండటంలోకి వెళ్లిపోయారు. ఆయన వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా క్యూకట్టారు. కొత్త దంపతులు కావ్య, మనోహర్ ఆనందానికి అవధులు లేవు. సీఎం కేసీఆర్ మా పెళ్లికి రావటం ఏంటీ అంటీ అని అక్కడ ఉన్న వాళ్లందరూ తమకు తాము ఓ సారి గిల్లి చూసుకున్నారు.

cm kcr attends marriage

నవ దంపతులను కలిసి సీఎం కేసీఆర్ వారికి ఆశీర్వచనాలు అందజేశారు. అదేవిధంగా కల్యాణలక్ష్మీ పథకం కింద ఆర్థికసాయం అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఊహించని పరిణామంతో ఆనందాశ్చర్యాలకు లోనైన నూతన వధూవరులు సీఎం కేసీఆర్, ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌లకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

- Advertisement -