వెంకీ ‘దృశ్యం’కు ఆరేళ్లు..!

221
drushyam
- Advertisement -

సురేష్ ప్రొడక్షన్స్, వైడ్ యాంగిల్ క్రియేషన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్‌ దృశ్యం. 2014లో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా వెంకీ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.మలయాళంలో 2013లో వచ్చిన ఈ సినిమాకు రీమేక్‌గా దృశ్యం తెరకెక్కింది. ఈ సినిమాతో సురేష్ ప్రొడక్షన్స్ సినీరంగంలో 50 ఏళ్ళు పూర్తిచేసుకుంది.

ఈ సినిమా రాంబాబు అనే మధ్యతరగతి వ్యక్తి, తన కుటుంబం చుట్టూ తిరుగుతుంది. అరకులోని రాజవరం గ్రామంలో కేబుల్ ఆపరేటరుగా పనిచేసే రాంబాబుకి తన భార్య జ్యోతి, కూతుళ్ళు అంజు, అనులే ప్రపంచం. అనుకోకుండా వరుణ్ అనే కుర్రాడు అంజు నగ్నంగా ఉన్నప్పుడు ఒక వీడియో తీసి దాన్ని చూపించి అంజుని, జ్యోతిని బెదిరిస్తాడు. తమని తాము కాపాడుకోవడం కోసం వరుణ్ తలపై మోది గాయపరచాలనుకున్నా అతను చనిపోతాడు. విషయం తెలుసుకున్న రాంబాబు వరుణ్ తల్లి, ఇన్స్పెక్టర్ జనరల్ అయిన గీత ప్రభాకర్ నుంచి, ఇతర పోలీసుల నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోడానికి ఏం చేసాడన్నదే ఈ సినిమా కథ.

ప్రపంచవ్యాప్తంగా 2014 జూలై 11న విడుదలైనా 2014 జూలై 9న ప్రత్యేకమైన ప్రీమియర్ షోలను ఏర్పాటు చేశారు. విమర్శకులను అమితంగా మెప్పించిన ఈ సినిమా భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా తీసేందుకు సిద్ధమవుతున్నారంటే దృశ్యం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో అర్దం చేసుకోవచ్చు.

- Advertisement -