550టైమ్స్‌.. రీ-రిలీజ్ మూవీ ఓం

48
- Advertisement -

ఒకప్పుడు సినిమాలు వంద రోజులు రెండువందల రోజులు ఆడిన సందర్భాలు ఉన్నాయి. కానీ నేటి రోజుల్లో మాత్రం కనీసం నెలరోజులైన ఆడలేకపోతున్నాయి. అయితే వీటితో పాటుగా నాటి సినిమాలను మళ్లీ విడుదల చేసి వాటి ద్వారా వచ్చిన ఆదాయంను ఏదైన సేవా సంస్థలకు విరాళంగా ప్రకటిస్తున్నారు. భారతీయ సినిమా చరిత్రలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 550సార్లు రీ-రిలీజ్‌ అయిన సినిమా ఏదైనా ఉందంటే అది ఓం.

కన్నడ సూపర్‌ స్టార్ శివరాజ్‌కుమార్ నటించిన ఈ సినిమా 1995 మే 19న విడుదలైంది. 2015 మే 19నాటికి(28యేళ్లు పూర్తయ్యాయి) ఏకంగా 550 సార్లు రీ-రిలీజ్ అయిన సినిమాగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాందించుకుంది. ఇంతకి దీన్ని దర్శకత్వం వహించింది ఎవరో తెలుసా…ఉపేంద్ర. ప్రేమ హిరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో కొన్ని పాత్రలో నిజమైన రౌడీలను గుండాలను కూడా తీసుకున్నట్టు శాండల్‌వుడ్‌ టాక్. అంతేకాదు ఇందుకోసం ఖైదీలను పేరోల్‌పై తీసుకువచ్చి నటింపజేశారు. కేవలం ఈ సినిమాకు రూ.70లక్షలు ఖర్చుకాగా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ కోసం ఉదయ్ టీవీ రూ.10కోట్లు పెట్టి కొనుగోలు చేశారు.

Also Read: లాల్ సలాంలో రజినీకాంత్..

అలాగే ఈ సినిమాకు 1996లో కర్ణాటక స్టేట్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా శివరాజ్‌ కుమార్, నటిగా ప్రేమ, ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా ఉపేంద్ర, సినిమాటోగ్రాఫర్‌గా బీసీ గౌరీ శంకర్‌లు అవార్డులు సొంతం చేసుకున్నారు. ఈ సినిమాను తెలుగులో రాజశేఖర్‌ హీరోగా ఓంకారమ్‌ పేరుతో, అర్జున్‌ పండిట్ పేరుతో సన్నీడీయోల్‌ హీందీలో రీమేక్ చేశారు.

Also Read: Simhadri:వావ్.. రీరిలీజ్‌ లోనూ హౌస్‌ ఫుల్ బోర్డ్స్

- Advertisement -