- Advertisement -
ఈ నెల 26 మహా శివరాత్రితో మహా కుంభమేళా ముగియనున్న సంగతి తెలిసిందే. కుంభమేళాలో పుణ్య స్నానం ఆచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. దీంతో ప్రయాగ్ రాజ్ జనసంద్రంగా మారింది.
గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటివరకు 53 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచంలోనే ఇంత మంది భక్తులు పాల్గొన్న మొదటి కార్యక్రమంగా కుంభమేళా రికార్డు సృష్టించింది.
పౌష్ పూర్ణిమ సందర్భంగా జనవరి 13వ తేదీన మహాకుంభమేళా ప్రారంభమైంది. దాదాపు 45 రోజులపాటూ జరిగే ఈ మహా కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారని ప్రభుత్వం అంచనా వేయగా దీనిని క్రాస్ చేశారు.
Also Read:ఆస్ట్రేలియాలో కేసీఆర్ బర్త్ డే.. వృక్షార్చన
- Advertisement -