తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫామ్ అందించారు సీఎం కేసీఆర్. తొలి రోజు 51 మంది అభ్యర్థులకు బీ ఫామ్ అందించగా ఉమ్మడి మెదక్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేశారు. బీఫామ్‌లతో పాటు ఒక్కొక్కరికీ రూ.40 లక్షల చెక్కును అందజేశారు. కేసీఆర్ తరపున గంప గోవర్ధన్, మంత్రి ప్రశాంత్ రెడ్డి తరపున ఎమ్మెల్సీ కవిత బీ-ఫారమ్ అందుకున్నారు. కేసీఆర్ చేతుల మీదుగా సిరిసిల్ల అసెంబ్లీ అభ్యర్థిగా బీ- ఫామ్ అందుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
బీ-ఫారమ్ అందుకున్న వారిలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, షకీల్, జాజాల సురేందర్, గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, పట్నం నరేందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మా రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్, హర్షవర్ధన్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, చంటి క్రాంతి కిరణ్, మహిపాల్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, రేగా కాంతారావు, హరిప్రియ నాయక్, పువ్వాడ అజయ్, లింగాల కమల్ రాజ్, సండ్ర వెంకట వీరయ్య, వనమా వెంకటేశ్వర్ రావు, మెచ్చా నాగేశ్వర్ రావుతో పాటు పలువురు అందుకున్నారు.
Also Read:క్యాబేజీతో ఆరోగ్య ప్రయోజనాలు..!