ఏపీలో కరోనా విజృంభణ..

191
corona
- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య 2లక్షలు దాటింది. ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో ఏకంగా 5,086 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 9,42,135కి చేరుకోగా.. 9,03,072 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.

ఇదే సమయంలో 14 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో ఐదుగురు, అనంతపూర్, కర్నూల్, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, గుంటూరు, కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 7,353 మంది మృతి చెందారు. మరోవైపు 1,745 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,710 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

- Advertisement -