- Advertisement -
సామాజిక మాధ్యమాల్లో మహిళలను వేధించి, బెదిరించే వారికి భారతీయ న్యాయ సంహిత 2023కింద ఐదేళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా విధించడానికి వీలుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ సహాయమంత్రి జితిన్ ప్రసాద తెలిపారు.
ఈ అంశంపై లోక్సభలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. మహిళలపై నేరాలకు పాల్పడేవారికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్-2000కింద అదనంగా శిక్ష విధించడానికి వీలుందని తెలిపారు.
Also Read:రేవంత్ నడిపేది సర్కార్ కాదు సర్కస్!
- Advertisement -