ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. తెలంగాణ, మద్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, మిజోరాం, రాజస్తాన్.. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు భారత జనతా పార్టీకి అత్యంత కీలకం. ఎందుకంటే వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికలకు ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సెమీ ఫైనల్ లాంటివి పైగా ప్రస్తుత పరిస్థితుల్లో మోడీ సర్కార్ కు వ్యతిరేకత పవనలు విస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సత్తా చాటి అదే జోష్ ను పార్లమెంట్ ఎన్నికల వరకు కొనసాగించాలని బిజెపి అధిస్థానం భావిస్తోంది..
అందుకే అభ్యర్థుల విషయంలో ఆయా రాష్ట్రాలలో పోటీ చేసే స్థానాలపై బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టింది. తాజాగా బీజేపీ ఎన్నికల కమిటీతో సుధీర్ఘ సమావేశం జరిపిన బీజేపీ పెద్దలు.. ఐదు రాష్ట్రాలకు గాను రెండు రాష్ట్రాలలో తొలి జాబితా అభ్యర్థుల ప్రకటించింది. మద్య ప్రదేశ్ లో 39 స్థానాలకు, ఛత్తీస్ ఘడ్ లో 21 స్థానాలకు తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించింది. ఈ రెండు రాష్ట్రాలలో బీజేపీ కొంత మెరుగ్గా ఉంది. అందుకే మొదటి ఈ రెండు రాష్ట్రాలలోనే తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించినట్లు తెలుస్తోంది.
ఇక తెలంగాణ, రాజస్తాన్ వంటి రాష్ట్రాలలో బీజేపీయేతర పార్టీలు పాలన సాగిస్తున్నాయి. దానికి తోడు ఈ రెండు రాష్ట్రాలలో బీజేపీకి ఆశించిన స్థాయిలో ఆధారణ కూడా లేదు. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ అత్యంత బలహీనమైన పార్టీగా ఉంది. అందుకే ఈ రాష్ట్రంలో అభ్యర్థుల విషయంలో కాషాయ పెద్దలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. అయితే రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం వచ్చే నెల మొదటి వారంలో మిగిలిన రాష్ట్రాలలో కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందట. మరి గెలుపే లక్ష్యంగా సాగుతున్న బీజేపీకి ఈ ఐదు రాష్ట్రాలలో ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.
Also Read:ఫోన్ చార్జింగ్ పెట్టి నిద్రపోతే.. డేంజర్ !