తెలంగాణతోపాటు మిజోరం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజైంది. ఎన్నికలు జరగనున్న ఈ ఐదు రాష్ట్రాలను ఇప్పటికే పలుమార్లు విజిట్ చేశామని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ తెలిపారు. ఛత్తిస్ గడ్‌లో రెండు దశల్లో, మిగితా రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు పూర్తి చేస్తామని చెప్పారు. ఈ ఐదు రాష్ట్రాల్లో 60.2 లక్షల ఓటర్లు కొత్తగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారని చెప్పారు. ఎన్నికల నిర్వహణపై అన్ని రాజకీయ పార్టీలతో చర్చించామని తెలిపారు.
5 రాష్ట్రాల్లో 679 అసెంబ్లీ స్ధానాలకు ఎన్నికలు జరగనుండగా 16.5 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఆ ఐదు రాష్ట్రాల్లో మహిళా, యూత్ ఓటర్లు కీలకం కానున్నారని చెప్పారు. తెలంగాణలో 119 ,ఎంపీ 230,రాజస్ధాన్ 200,ఛత్తీస్ గఢ్ 90, మిజోరం 40 స్ధానాలకు ఎన్నికలు జరగనున్నట్లు చెప్పారు. ఎన్నికల కోసం 6 నెలలుగా కసరత్తు చేస్తున్నామన్నారు.
Also Read:ఓటీటీ : ఈ వారం చిత్రాల పరిస్థితేంటి?
ప్రతి ఓటర్..ఓటర్ లీస్ట్‌లో పేరు చెక్ చేసుకోవాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా మానిటరింగ్ చేస్తామన్నారు. 17వ తేదీ వరకు ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేసుకోవాలని.. అన్ని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.
Also Read:యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా గంజామ్!