యూకే నుంచి వచ్చిన 5 మందికి కొత్త కరోనా..

412
delhi-airport
- Advertisement -

బ్రిటన్‌లో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేకెత్తిస్తోంది. కరోనా ఇంకా ఉద్ధృతంగా ఉన్న తరుణంలోనే కొత్త స్ట్రెయిన్ రావడం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికే ఈ కొత్త వైరస్ పలు ఇతర దేశాలకు పాకినట్టు తెలుస్తోంది. పలు దేశాలు బ్రిటన్ పై ట్రావెల్ బ్యాన్ విధించాయి. ఇండియా కూడా ట్రావెల్ బ్యాన్ విధించినప్పటికీ… రేపటి నుంచి నిషేధం అమల్లోకి రాబోతోంది. మరోవైపు, బ్రిటన్ నుంచి పెద్ద సంఖ్యలో భారతీయులు స్వదేశానికి తిరిగొస్తున్నారు. దేశంలోని అన్ని విమానాశ్రయాలలో ప్రయాణికులకు టెస్టులు నిర్వహిస్తున్నారు.

గత రాత్రి లండన్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీకి చేరుకున్న 266 మంది ప్రయాణికుల్లో ఐదుగురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అలాగే చెన్నైకి వచ్చిన వారిలో ఒకరి, పశ్చిమబెంగాల్‌ వచ్చిన వారిలో ఇద్దరికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో నమూనాలను సేకరించి.. కొత్త కరోనా కొత్త జాతేనా? కాదా? అని తెలుసుకునేందుకు ఎన్‌సీడీసీకి పంపారు. దీంతో, ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఉదయం బ్రిటీష్ ఎయిర్ వేస్ కు చెందిన మరో విమానం ఢిల్లీలో ల్యాండ్ అయింది. ఈ విమానంలో వచ్చిన ప్రయాణికులందరి శాంపిల్స్ ని సేకరించారు. వీరి శాంపిల్స్ ను నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఫర్ రీసర్చ్ కి పంపించారు. పాజిటివ్ వచ్చిన వారందరినీ ఐసొలేషన్ కు పంపుతున్నారు.

- Advertisement -