Budget 2024:ఈ 5 అంశాలే ఫోకస్

21
- Advertisement -

ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న సంగతి తెలిసిందే. ఇక ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ 6వ సారి బడ్జెట్‌ను ప్రవేశ పెడుతోంది. ఎన్నికల ముందు వచ్చే బడ్జెట్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈసారి బడ్జెట్‌లో 5 కీలక అంశాలపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్-మే సాధారణ ఎన్నికల తర్వాత ఎన్నికైన కొత్త ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ను జూలైలో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.

ఆర్థిక వృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు, రాబోయే బడ్జెట్‌లో ముఖ్యంగా మౌలిక సదుపాయాల రంగం కోసం మూలధన వ్యయాన్ని పెంచే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగాల సృష్టిపై దృష్టి సారించే అవకాశం ఉంది. గ్రామీణ రంగంలో ఉద్యోగాలను సృష్టించేందుకు, గ్రామీణ మౌలిక సదుపాయాలపై పెట్టుబడిని పెంచడానికి మరియు రసాయనాలు, సేవల వంటి రంగాలకు ఉత్పత్తి-సంబంధిత ప్రోత్సాహక (PLI) పథకాల పరిధిని విస్తరించడానికి ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశం ఉంది.

భారత స్థూల జాతీయోత్పత్తి (GDP)లో ఆర్థిక లోటును మరింత తగ్గించే అవకాశం ఉంది. మధ్యంతర బడ్జెట్‌లో సామాజిక రంగ పథకాలకు అధిక నిధులు కేటాయించే ఛాన్స్ ఉంది. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసే ఛాన్స్ ఉంది. మొత్తంగా నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టే బడ్జెట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read:చంద్రబాబు బ్యాడ్ లక్..నో చెప్పిన పీకే!

- Advertisement -