నాలుగో దశ పోలింగ్…అప్‌డేట్

20
- Advertisement -

నాలుగో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. ఉదయం నుండే ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూకట్టారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా 10 రాష్ర్టాలు/యూటీల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది.

96 లోక్‌సభ స్థానాల్లో మొత్తం 1,717 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 1.92 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దాదాపు 17.70 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 8.73 కోట్ల మంది మహిళలు ఉన్నారు.

సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ యూపీలోని కన్నౌజ్‌ నుంచి,కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌, టీఎంసీ ఫైర్‌ బ్రాండ్‌ మహు వా మొయిత్రా, కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి, మాజీ క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌, నిత్యానంద్‌ రాయ్‌, పంకజ ముండే, తదితర నేతలు భవితవ్యం ఈ దశ ఎన్నికల్లో తేలనున్నది. తెలంగాణలో 3.32 కోట్లమంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Also Read:సత్యదేవ్ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్‌

- Advertisement -