అక్కినేని ప్రేమనగర్‌కు 49 ఏళ్లు…

500
premanagar
- Advertisement -

తెలుగు ఇండస్ట్రీ ఆల్ టైం హిట్ సినిమాల్లో ఒకటి ప్రేమనగర్‌. అక్కినేని నాగేశ్వరరావు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమాల్లో టాప్ 5లో ఉంటుంది ఈ మూవీ. సరిగ్గా 49 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ చిత్రం అప్పటివరకు ఉన్న టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది.

1971లో ప్రఖ్యాత రచయిత్రి అరికెపూడి కౌసల్యాదేవి (కోడూరి కౌసల్యాదేవి) వ్రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. కళ్యాణ్ (అక్కినేని) అనే జమీందారు కొడుకు విలాసనంతమైన జీవితానికి, దురలవాట్లకు బానిసయ్యాడు. ఎయిర్-హోస్టెస్‌గా పరిచయమైన లత (వాణిశ్రీ) వారింట్లో సెక్రటరీగా చేరుతుంది. అయితే కళ్యాణ్‌ను లత దురలవాట్లనుండి దూరం చేస్తుంది. సీన్ కట్ చేస్తే లతను వివాహం చేసుకోవాలని కళ్యాణ్ భావించగా కుటుంబసభ్యుల నుండి వ్యతిరేకత వస్తుంది. దీంతో అలా విడిపోయిన వారు తిరిగి ఎలా కలుసుకున్నారు అన్నదే ప్రేమనగర్ కథ.

అత్యంత విజయనంతమైన తెలుగు నవలాచిత్రాలలో ఈ సినిమా కథ ఒకటి. నిర్మాతగా అప్పటివరకు నష్టాలను చవిచూసిన రామానాయుడు ఈ సినిమాతో సినీరంగంలో తిరుగులేని స్ధాయికి చేరుకున్నారు. తర్వాత ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తమిళం, హిందీలలో కూడా తెరకెక్కించారు.

- Advertisement -