మునుగోడు ఉప ఎన్నికల పర్వంలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. మొత్తం 130 నామినేషన్లు దాఖలు కాగా స్క్రూటినీ తర్వాత 83 మంది అభ్యర్థుల నామినేషన్లు ఓకే అయ్యాయి. ఇక నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సరికి 36 మంది విత్ డ్రా చేసుకోవడంతో చివరగా పోటీలో 47 మంది అభ్యర్థులు నిలిచారు.
టీఆర్ఎస్ నుండి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుండి పాల్వాయి స్రవంతి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉండగా అందరికి గుర్తుల కేటాయింపు కూడా జరిగింది. అయితే టీఆర్ఎస్ గుర్తును పోలిన గుర్తులను కేటాయించడంపై ఆపార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
సాగర్, నకిరేకల్ ఎన్నికల్లో రోడ్ రోలర్, డోజర్, ఆటో గుర్తుల కారణంగానే పార్టీకి తీవ్ర నష్టం కలిగిందని, ఈ ఎన్నికలో ఆ గుర్తులను తొలగించాలని నేతలు న్యాయపోరాటానికి సైతం దిగారు. ఇక టీఆర్ఎస్కు మద్దతుగా పెద్ద ఎత్తున ఇండిపెండెంట్లు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

