జాక్ పాట్ అంటే ఇది!

162
- Advertisement -

చిన్న లాటరీ తగిలితేనే ఎగిరి గంతేస్తాం. అందరికీ చెప్పుకుని పండుగ చేసుకుంటాం. అదే కోట్లలో గెలిస్తే మన కాళ్లు భూమ్మీద ఆగవు. అలాంటిది ఓ వ్యక్తి తన జీవితాన్నే మార్చే లాటరీ దక్కించుకన్నాడు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన వ్యక్తికి జాక్ పాట్ తగిలింది. పవర్‌బాల్‌ కంపెనీ ఈ లాటరీని నిర్వహించింది. ఇంత అదృష్టం ఎవరిని వరించిందనేది మాత్రం ఇప్పటివరకు బయటపడలేదు. కాలిఫోర్నియాలోని రివర్‌సైడ్‌ కౌంటీ అనే ప్రాంతంలోని ఓ దుకాణంలో ఈ బంపర్‌ టికెట్‌ అమ్ముడైనట్లు లాటరీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. లాటరీ టికెట్‌ అమ్మిన దుకాణం యజమానికి కూడా దాదాపు ఒకటిన్నర కోటి రూపాయలను పవర్‌బాల్‌ అందజేయనుంది.అతను ఈ లాటరీలో ఏకంగా 448 మిలియన్‌ డాలర్లు (2,888 కోట్ల రూపాయలు) గెలుచుకున్నారని తెలిపారు.

ఈ మొత్తంలోంచి స్థానిక పన్నులు, ఇతర చార్జీలు మినహాయించి మిగిలిన మొత్తాన్ని విజేతకు అందజేస్తామని తెలిపారు. అలాగే ఈ లాటరీ టికెట్ కాలిఫోర్నియాలోని రివర్‌ సైడ్‌ కౌంటీ అనే ప్రాంతంలోని దుకాణం నుంచి విజేత కొనుగోలు చేశారని, అందువల్ల ఈ దుకాణ దారులకు సుమారు కొటిన్నర రూపాయలు అందజేయనున్నామని వారు తెలిపారు. కాగా, అమెరికాతో పాటు మరికొన్న పాశ్చాత్య దేశాల్లో లాటరీలు అధికారికం…తాజాగా కేరళలో కూడా రాష్ట్ర ప్రభుత్వం లాటరీ వ్యాపారం ప్రారంభించిన సంగతి తెలిసిందే.

- Advertisement -