అక్టోబర్ 23న ‘418’

2
- Advertisement -

పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ‘418’తో డార్కర్ జానర్ లో అడుగుపెడుతోంది. సీరియస్, అన్‌సెటిలింగ్ నెరేటివ్‌తో భయాన్ని కొత్త కోణంలో చూపించబోతున్న ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న ఈ సినిమాతో కీర్తన్ నాదగౌడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కథను కూడా ఆయనే రాశారు. నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైత్ర ఆచార్, సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, శశాంక్ పాటిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. దసరా సందర్భంగా అక్టోబర్ 23న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Also Read:రష్యాలో న్యుమోనిక్ ప్లేగ్ అనుమానిత కేసు..

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ హారర్, మిస్టరీతో సంచలనం సృష్టించింది. స్టన్నింగ్ విజువల్స్, చిల్లింగ్ పెర్ఫార్మెన్స్, హాంటింగ్ స్కోర్, సూపర్‌నేచురల్ థ్రిల్స్‌తో ‘418’ గ్రిప్పింగ్ హారర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతుంది.

నటీనటులు: చైత్ర ఆచార్, సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, శశాంక్ పాటిల్

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: కీర్తన్ నాదగౌడ
నిర్మాతలు: నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
సమర్పణ: ప్రశాంత్ నీల్
సంగీతం: వెంకీ జీజీ
సినిమాటోగ్రఫీ: దినేష్ దివాకర్
ప్రొడక్షన్ డిజైనర్: ఉల్లాస్ హైదూర్
పీఆర్ఓ: వంశీ-శేఖర్

- Advertisement -