రాష్ట్రంలో కొత్తగా 41 కరోనా పాజిటివ్ కేసులు..

285
- Advertisement -

తెలంగాణలో కరోనా వైరస్‌ తీవ్రత మళ్లీ క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో ఇవాళ మరో 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 1854కు చేరుకుంది. ఈ రోజు కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 23 కేసులు నమోదయ్యాయి.

కరోనాతో మరో నలుగురు మృతి చెందగా..మొత్తం మరణాల సంఖ్య 53 చేరింది. కరోనా నుంచి కోలుకొని మరో 24 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 1092 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 709 మంది చికిత్స పొందుతున్నారని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వివరాలను వెల్లడించింది.

corona in ts

- Advertisement -