నటసార్వభౌమ ఎన్టీఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన మూవీల్లో ఒకటి గజదొంగ. సరిగ్గా 40 సంవత్సరాల క్రితం జనవరి 30న రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఎన్టీఆర్ ద్విపాత్రాభినం చేయగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించారు. . విజయదుర్గా ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందింది.
‘గజదొంగ’ సినిమా అనగానే అందరికీ ముందుగా అందులో యన్టీఆర్ ‘గోల్డ్ మేన్’గా అలరించిన తీరు గుర్తుకు వస్తుంది. జయసుధ, శ్రీదేవి హీరోయిన్లుగా నటించగా రావు గోపాలరావు మెయిన్ విలన్ గా నటించారు. మిగిలిన పాత్రల్లో సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, గుమ్మడి, కాంతారావు, పి.ఎల్.నారాయణ, పుష్పవల్లి, పండరీబాయ్, మమత, చలపతిరావు అభినయించారు. జయమాలిని ఓ పాటలో తళుక్కుమంది. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన చక్రవర్తి అతిథి పాత్రలో అలరించారు.
ఆరోజుల్లోనే కోటి రూపాయలు వసూలు చేసిన ఈ చిత్రం ఎన్టీఆర్ ఆల్‌టైమ్ హిట్ మూవీల్లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ ఎన్టీఆర్ నటన.ద్విపాత్రాబినయంలో ఎన్టీఆర్ ఇరగదీశాడు. సినిమాలో సాంగ్స్ ముఖ్యంగా జయమాలిని ఐటమ్ సాంగ్ నీ ఇల్ల బంగారం కాను ఇప్పటికి ఎవర్‌గ్రీనే. బుల్లితెరపై ఈ సినిమా ఇప్పుడు వచ్చినా టీవీలకు అతుక్కుపోయి చూస్తారంటే అతిశయోక్తికాదు.