గుర్మీత్ కు 40 రోజుల పెరోల్..

9
- Advertisement -

డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు మరోసారి పెరోల్ మంజూరైంది. అత్యాచారం,హత్య కేసుల్లో దోషిగా శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్‌కు 40 రోజుల పెరోల్ లభించడంతో ఆయన జైలు నుండి విడుదలయ్యారు.

జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన ఊరేగింపుగా డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయంకు చేరుకున్నారు. గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ 2020 తర్వాత తాత్కాలికంగా జైలు నుంచి బయటకు రావడం ఇది 14వ సారి కావడం గమనార్హం.

ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ ఆయన 21రోజుల సెలవుపై విడుదలయ్యారు. ఇప్పటి వరకు,ఇలా ఆయన మొత్తం 326 రోజులు జైలు వెలుపలే గడిపారు. 2017లో తన ఆశ్రమానికి చెందిన ఇద్దరు మహిళ శిష్యులపై అత్యాచారానికి పాల్పడ్డారన్నఆరోపణలపై న్యాయస్థానం 20ఏళ్ల జైలు శిక్ష విధించింది.అలాగే 2019లో జరిగిన పత్రికా విలేఖరి హత్య కేసులో కూడా ఆయనను దోషిగా తీర్పు చెప్పింది.

Also Read:‘ఉస్తాద్ భగత్ సింగ్’..క్రేజీ షెడ్యూల్!

- Advertisement -