- Advertisement -
తెలంగాణకు 4 TMC ల నీటి విడుదలకు కర్ణాటక ప్రభుత్వం సమ్మతించింది. పాలమూరు జిల్లాలో తాగు, సాగునీటి అవసరాల కోసం నారాయణపూర్ జలాశయం నుంచి 5 TMC ల నీటిని జూరాలకు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
కర్ణాటక ప్రభుత్వం 4 TMC ల నీటిని విడుదల చేయడానికి అంగీకరించింది. ఈ మేరకు తెలంగాణ తరపున బెంగళూరు వెళ్లిన మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి, జి. మధుసూదన రెడ్డి, మేఘా రెడ్డి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
Also Read:‘తండేల్’ నా కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ!
- Advertisement -