అరకు బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం: సీఎం కేసీఆర్

136
- Advertisement -

విశాఖజిల్లా అరకు ఘాట్‌రోడ్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో 4గురు ఈక్కడికక్కడే మృతిచెందిన సంగతి తెలిసిందే. బాధితులంతా హైదరాబాద్‌ వాసులు కాగా ఈ ఘటనపై సీఎం కేసీఆర్,గవర్నర్ తమిళి సై, మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరుగడం పట్ల విచారం వ్యక్తంచేశారు సీఎం కేసీఆర్. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కేటీఆర్… బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ట్రావెల్స్‌ బస్సు ప్రమాదంపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం తనను తీవ్రంగా కలిచిపేసిందని …బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

అరుకు బస్సు ప్రమాదానికి గురైన బాధితులంతా హైదరాబాద్ నగరానికి చెందిన షేక్ పేట్ సీతానగర్‌కు చెందిన వారని గుర్తించారు. విశాఖ అరకుతో పాటు పలు ప్రాంతాలను పర్యటించేందుకు ఈ నెల 10వ తేదీన తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో సీతానగర్ నుంచి బయలుదేరారు. ఈ ప్రమాదంలో మరణించిన నలుగురు సభ్యులు కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో వారి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.

- Advertisement -