అక్బర్‌ పై హత్యాయత్నం కేసులో నలుగురికి శిక్ష..

247
4 convicted in MLA Akbaruddin Murder case
- Advertisement -

మజ్లిస్‌ శాసన సభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీపై హత్యాయత్నం కేసులో గురువారం నాంపల్లి న్యాయస్ధానం  తుదితీర్పు వెలువరించింది. మొత్తం 15 మందిలో నలుగురిని దోషులుగా నిర్దారిస్తు కోర్టు తీర్పు వెలువరించింది.  సలీంబిన్,అబ్దుల్లా యాఫై,అవద్ యాఫై,ఒమర్ యాఫైలను దోషులుగా తేల్చింది. వీరికి న్యాయస్థానం శిక్షలు ఖరారు చేయాల్సి ఉంది. ఏ2,ఏ3,ఏ5,ఏ 12గా ఉన్న నిందితులను దోషులుగా తేల్చింది. దాదాపుగా 86 మంది సాక్షులను విచారించిన న్యాయస్ధానం  ప్రధాన నిందితుడు పహిల్వాన్‌ తో పాటు పదిమందిని నిర్దోషులుగా ప్రకటించింది.

2011 ఏప్రిల్‌ 30న చాంద్రాయణగుట్ట కేశవగిరిలోని బార్కస్‌-బాలాపూర్‌ రోడ్డులో ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో అక్బరుద్దీన్‌కు తీవ్ర గాయాలు కాగా, దాడికి పాల్పడ్డ ఇబ్రాహిం బిన్‌ యూనుస్‌ యాఫై (25) గన్‌మెన్‌ కాల్పుల్లో మరణించాడు. ఈ కేసులో మొత్తం 15 మందిపై చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. తదుపరి చర్యల నిమిత్తం కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు.

4 convicted in MLA Akbaruddin Murder case
సీసీఎస్‌ పోలీసులు వేగంగా పరిశోధించి ప్రధాన నిందితుడు మహ్మద్‌ బిన్‌ ఒమర్‌ యాఫై అలియాస్‌ మహ్మద్‌ పహిల్వాన్‌(50) సహా హుస్సేన్‌ బిన్‌ ఒమర్‌ యాఫై అలియాస్‌ హసన్‌(48), అబ్దుల్లా బిన్‌ యూనుస్‌ యాఫై(36), ఇబ్రాహిం బిన్‌ యూనుస్‌ యాఫై(25) (గన్‌మెన్‌ కాల్పుల్లో ఇతను చనిపోయాడు), అవద్‌ బిన్‌ యూనుస్‌ యాఫై, యూనుస్‌ బిన్‌ ఒమర్‌ యాఫై అలియాస్‌ యూనుస్‌ యాఫై(67), ఈసా బిన్‌ యూనుస్‌ యాఫై(32), యహియా బిన్‌ యూనుస్‌ యాఫై(28), ఫైసల్‌ బిన్‌ అహ్మద్‌ యాఫై(30), ఫజల్‌ బిన్‌ అహ్మద్‌ యాఫై(32), మహ్మద్‌ బహదూర్‌ అలీఖాన్‌ అలియాస్‌ మునవర్‌ ఇక్బాల్‌(52), మహ్మద్‌ బిన్‌ సాలెహ్‌ వహ్‌లాన్‌(32), హఫీఫ్‌ బిన్‌ యూనుస్‌ యాఫై(23), సైఫ్‌ బిన్‌ హుస్సేన్‌ యాఫై(25), మహ్మద్‌ అమెరుద్దీన్‌ అలియాస్‌ ఆమెర్‌(22)లను అరెస్ట్‌చేశారు. అనంతరం వీరందరిపై అభియోగపత్రాలు కోర్టులో సమర్పించారు.

అక్బర్‌ పై దాడికేసు విచారణ నాంపల్లి క్రిమినల్‌ కోర్టులో ఆరేళ్ల నుంచి విచారణ కొనసాగుతోంది. బెయిలు లేకుండా నిందితుల్లో పలువురు జైలుకే పరిమితం అయ్యారు. కేసులో మొత్తం 86 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. గత నెలలోనే విచారణ పూర్తయింది. తుదితీర్పు తేదీ కోసం ఇరు పక్షాలు ఆసక్తిగా ఎదురుచూశాయి. తుది తీర్పు నేపథ్యంలో పాతబస్తీలో ముందస్తుగా భద్రతను కట్టుదిట్టం చేశారు.

- Advertisement -