కలియుగ పాండవులుకు 35 ఏళ్ళు

200
venki
- Advertisement -

వెంకటేష్ కెరీర్‌లో బ్లాక్ బాస్టర్ మూవీ కలియుగ పాండవులు. యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన చిత్రం ఇండస్ట్రీ బ్లాక్ బ్లాస్టర్ హిట్‌ మూవీగా నిలిచింది. వెంకటేష్ సరసన ఖుష్బు హీరోయిన్‌గా నటించగా రావుగోపాల్ రావు, చిట్టి బాబు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె రాఘవేంద్ర రావు నిర్వహించగా రామా నాయుడు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రవర్తి స్వరాలు సమకుర్చారు.

విజమ్ (వెంకటేష్) ధనవంతుల కుటుంబంలో పుట్టినవాడు..అతను ఏం తప్పులు చేసిన సమర్థించే తన తండ్రి చక్రపాణి (రావుగోపాల్ రావు). భారతి (ఖుషుబు) తేలివైన అమ్మాయి..విజయ్ చదువుతున్న కళాశాలలోనే చదువుతుంటుంది..ఇద్దరు ప్రేమించుకోని..పెళ్ళిచేసుకుంటారు. కాని విజమ్ నాన్న చక్రపాణి భారతిని తన కోడలుగా ఒప్ఫుకోడు..అలాగే ఆమేను ఒక వేశ్యగా చిత్రీకరించాలనుకుంటాడు..అలాంటి పరిస్థితుల్లో విజయ్ భారతిని ఎలా కాపాడుకుంటాడు..అనేది సినిమా కథ…

సరిగ్గా 35 ఏళ్ళ క్రితం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాగా వెంకటేష్ హీరోగా ఇది తొలి చిత్రం. తొలి చిత్రంతోనే హీరోగా సక్సెస్ ను సొంతం చేసుకున్నారు వెంకటేశ్. ఈ చిత్రానికి కథ, మాటలు పరుచూరి బ్రదర్స్ సమకూర్చగా, కె.ఎస్.ప్రకాశ్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. వేటూరి పాటలకు చక్రవర్తి సంగీతం తోడై అలరించింది. “ఒక పాపకు పదహారేళ్ళు…”, “హా హా హా ఆగవా…”, “నేను పుట్టినరోజు…”, “ఎందుకో ఒళ్ళు…”, “బుగ్గా బుగ్గా చెప్పాలి…”, “ఈ కౌరవ ఈ దానవ …” పాటలు ఆకట్టుకున్నాయి.

- Advertisement -