చిరంజీవి…రాక్షసుడుకి 35 ఏళ్ళు

274
rakshasudu
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బాస్టర్ సినిమాల్లో ఒకటి రాక్షసుడు. 1986 అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం యండమూరి వీరేంద్రనాథ్ రాసిన ‘రాక్షసుడు’ నవల ఆధారంగా తెరకెక్కింది.

చిరంజీవి, ఎ.కోదండరామిరెడ్డి, క్రియేటివ్ కమర్షియల్స్ కె.ఎస్.రామారావు, ఇళయరాజా, యండమూరి కాంబినేషన్ కావడంతో సినిమాకు మరింత ప్లస్‌గా మారింది.ఈ చిత్రంలోని ఐదు పాటలను వేటూరి రాశారు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు,హే నాటీ లవ్ బోయ్,అచ్ఛా అచ్ఛా వచ్చా వచ్చా,గిలిగా గిలిగిలిగా గిలిగింతగా,నీ మీద నాకు ఇదయ్యో పాటలు భలేగా ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రంలో సుహాసిని, రాధ, జయమాల, టైగర్ ప్రభాకర్, రావు గోపాలరావు, రాజేంద్రప్రసాద్, అన్నపూర్ణ, సుమలత, సంయుక్త, ఎమ్.వి.ఎస్.హరనాథరావు, నర్రా, పి.జె.శర్మ, జగ్గారావు తదితరులు నటించారు.

గాంధీ జయంతి కానుకగా వచ్చినా మరో వారానికే దసరా పండగ కూడా రావడంతో ‘రాక్షసుడు’ కలెక్షన్ల సునామీ సృష్టించింది. పలు కేంద్రాల్లో శతదినోత్సవం కూడా జరుపుకుంది.

- Advertisement -