- Advertisement -
ఈ రోజు హైదరాబాద్‌లోని మాదాపూర్ హెచ్ఐసీసీలో 34వ ఇండియన్ ఇంజనీర్స్ కాంగ్రెస్ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ ,మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అథితులుగా హాజరై సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా సదస్సులో గవర్నర్ తమిళసై సౌందర రాజన్ మాట్లాడుతూ..పేదల బతుకులు మార్చేందుకు.. సాంకేతికత ఉపయోగపడాలి. కృత్రిమ మేధతో ఇంజనీర్లు తమ ప్రతిభను, పనితీరుకు పదును పెట్టుకోవాలి.ఇంజనీరింగ్ కృషి దేశాభివృద్ధికి దోహదపడాలని గవర్నర్ అన్నారు.
ఇక రాష్ట్రంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన ఇంజనీరింగ్ కృషి అభినందనీయం, గర్వకారణం అని గవర్నర్ అన్నారు. పర్యావరణాన్ని పాడు చేయకుండా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని .. సహజ వనరులు కాపాడుకుంటూ రాబోయే భావి తరాలకు ఒక చక్కని ecosystem అందివ్వల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.
- Advertisement -