మెట్రో మరో అరుదైన రికార్డు

347
Ameerpet-LB Nagar Metro
- Advertisement -

హైదరాబాద్ మెట్రో రైలు మరో అరుదైన రికార్డు సాధించింది. ఈనెల 7న ముఖ్యమంత్రి కేసీఆర్ జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మార్గంలో మెట్రో రైలును ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రారంభించిన రోజు 33వేల886మంది ప్రయాణించనట్లు తెలిపారు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ఇందులో ఎంజీబీఎస్‌ స్టేషన్‌ నుంచి అత్యధికంగా 14,894 మంది ప్రయాణం చేసినట్లు తెలిపారు. ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌కు సంబంధించి కారిడార్‌1లో 2,45,865 మంది, నాగోల్‌ నుంచి ఉప్పల్‌కు సంబంధించి కారిడార్‌3లో 2,45,825 మంది ప్రయాణించినట్లు ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.

ఇలా మూడు మార్గాల్లో కలిపి 4.47లక్షల మంది ప్రయాణించినట్లు వెల్లడించారు. ఇందులో క్యూఆర్‌ కోడ్‌తో టికెట్లు కొనుగోలు చేస్తున్నవారి సంఖ్య క్రమేపీ పెరుగుతుందని, ఇది సోమవారం ఒక్కరోజే 47 వేలకు చేరుకుందని పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రోకు విశేషమైన స్పందన వస్తుందన్నారు. ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించిన స్టేషన్లు వివరాలు చూస్తే అమీర్‌పేట 26వేలు, ఎల్‌బినగర్ 24వేలు, రాయదుర్గం 22వేలు, మియాపూర్ 19వేలు, కెబిహెచ్‌బి 17వేలు, సికింద్రాబాద్ ఈస్ట్ 15వేల మంది వెళ్లినట్లు మెట్రో ఉన్నతాధికారులు చెప్పారు.

- Advertisement -