31 ఇయర్స్ ఆఫ్ శివ….

406
shiva movie
- Advertisement -

తెలుగు సినిమా చరిత్రలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన మూవీ శివ. కాలేజీ క్యాంపస్‌లు అసాంఘిక శక్తుల అడ్డాలుగా మారిన నేపథ్యాన్ని కథాంశంగా తీసుకుని రామ్‌గోపాల్‌వర్మ అందించిన ఈ ‘శివ’ తెలుగు ప్రేక్షకుల మదిగదిలో నిక్షిప్తమైన రెండున్నర గంటల దృశ్య సంపద.

సరిగ్గా 31 సంవత్సరాల క్రితం అంటే 1989 అక్టోబర్‌ 5న ‘శివ’ సినిమా విడుదలైంది. ఆంధ్రదేశం అంతా అల్లకల్లోలం. పెద్ద సంచలనం. జనం విరగబడి చూశారు. కాలేజీల్లో శివ బ్యాచ్‌, భవాని బ్యాచ్‌ అని గ్రూపులేర్పడ్డాయి. సైకిల్‌ చెయిన్లు బ్లాక్‌లో అమ్ముడయ్యాయి. కాలేజీ కుర్రాళ్ళందరూ సైకిల్‌ చెయిన్లు పట్టుకుని తిరగటం మొదలుపెట్టారు.’శివ’లాంటి సినిమా తీయడం ఎలా సాధ్యమైందని చర్చ జరిగింది.

అప్పటివరకు మూసధోరణికి అలవాటు పడిపోయిన తెలుగు సినిమా నడకనే మార్చేసిం వెండి తెరపై శివతాండవం చేసింది శివ సినిమా. ‘శివ’కు ముందు ‘శివ’కు తరువాత తెలుగు సినిమా అని వర్గీకరించేంతగా ప్రభావం చూపింది.

55 రోజుల్లో 85 లక్షల రూపాయలతో తెరకెక్కిన ఈ చిత్రం టాలీవుడ్ ఎవర్‌గ్రీన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. శివ సినిమా విడుదలై 31 సంవత్సరాలు కావొస్తున్న నేపథ్యంలో #31YearsForShiva, #31YrsForSouthIndiaIHShiva అనే హ్యాష్ ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తూ విషెస్ చెబుతున్నారు ఫ్యాన్స్‌.

- Advertisement -