ఉచితంగా ఇస్తామంటున్నారంటే మరో ఆలోచనతో తీసుకెళ్తున్నట్లేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్… కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో బస్సు చార్జీల పెంపు ప్రతిపాదనపై స్పందించిన కేటీఆర్… బస్సు చార్చీల పెంపుపై కర్ణాటకను తెలంగాణ అనుసరించే రోజు దూరంలో లేదని చెప్పుకొచ్చారు.
ఐదు గ్యారెంటీల పేరుతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల మోత మోగిస్తోంది. ఇప్పటికే గైడెన్స్ వ్యాల్యూ ట్యాక్స్, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, రవాణా వాహనాలపై అదనపు సెస్, ఈవీలపై లైఫ్ టైమ్ ట్యాక్స్‌ను ఇబ్బడిముబ్బడిగా వసూలు చేస్తోంది.
Remember when someone says “it’s Free”, they are taking you for a ride
There’s always a heavy price for anything that you are told is “Free”
The day is not far when Telangana RTC will also follow in the footsteps of Karnataka and increase Bus Fares https://t.co/GR8YYPKECT
— KTR (@KTRBRS) July 15, 2024