ఒక్క సిగరేట్‌.. వందల కార్లు దగ్ధం..

217
- Advertisement -

ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన జరుగుతున్న బెంగళూరు యలహంక ఎయిర్‌బేస్‌ స్టేషన్‌ సమీపంలోని పార్కింగ్‌ ప్రాంతంలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 300కిపైగా కార్లు దగ్ధమైనట్లు అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పది అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పార్కింగ్‌ స్థలంలో కొన్ని వందల కార్లు, ద్విచక్రవాహనాలు ఉన్నాయి.

Bengaluru Air Show

మంటలు ఉవ్వెత్తున ఎగసి పడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. ఈ పార్కింగ్‌ స్థలానికి సమీపంలో కొన్ని విమానాలను కూడా ఉంచినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సిగరేటే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాల్చిపారేసిన సిగరేట్‌ ముక్క పార్కింగ్‌ సమీపంలోని ఎండుగడ్డికి అంటుకోవడంతో ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 20న ప్రారంభమైన ఈ ఎయిర్‌ షో..24 వ తేదీ వరకు జరగనుంది. దీంతో ఎయిర్ ‌షోను చూసేందుకు దూర ప్రాంతాల నుంచి జనం భారీగా తరలివచ్చారు.

- Advertisement -