- Advertisement -
సినీ ఇండస్ట్రీలో మరో నటుడి వారసురాలు ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఖడ్గం సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్‌తో ఫేమ్ అయిన పృథ్వీ కూతురు హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పృథ్వీ.. మా అమ్మాయి పేరు శ్రీలు. చిన్నప్పటి నుంచి సినిమాల్లోని సీన్లని ఇమిటేట్ చేసేది. నటనపై ఇష్టం పెంచుకుంది. పిల్లల ఇష్టం కాదనకూడదు అని తనని హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేద్దాం అనుకుంటున్నాను అని తెలిపారు.
తను యాక్టింగ్, డాన్స్ కూడా చాలా ఇష్టంగా నేర్చుకుంది. నన్ను ఆదరించినట్టే నా కూతుర్ని కూడా ఆదరించాలని కోరారు. కొత్త రంగుల ప్రపంచం అనే సినిమాతో పృథ్వి కూతురు శ్రీలు హీరోయిన్ గా పరిచయం అవుతోంది.
- Advertisement -