టీడీపీ,జనసేన పార్టీలపై తనదైన శైలీలో విమర్శలు గుప్పించారు సినీ నటుడు,వైసీపీ నేత,30 ఇయర్స్ పృథ్వీ. భీమవరంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు తరపున ప్రచారం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడిన పృథ్వీ టీడీపీ పార్టీని భూస్థాపితం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కంకణం కట్టుకున్నరని తెలిపారు.
రఘురామ కృష్ణంరాజుపై దాడి అమానుషం అన్నారు. నటన వేరు రాజకీయం వేరని తెలిపిన పృథ్వీ నాగబాబు, పవన్‌లు మాట్లాడే భాష సరికాదని సూచించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్‌గా మారారని నిప్పులు చెరిగారు. ఎన్నికల తర్వాత ఫ్యాన్ అసెంబ్లీలో, సైకిల్ స్టాండులో, గ్లాసు క్యాంటీన్‌లో ఉంటుందని జోస్యం చెప్పారు.
ప్రతి కుటుంబానికి మేలు జరిగేలా వైసీపీ మేనిఫెస్టో రూపొందించామని చెప్పిన పృథ్వీ జగన్ సీఎం కావాలని రాజన్న రాజ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. వైసీపీ మేనిఫెస్టోని టీడీపీ కాపీ కొట్టిందన్నారు.
బాబు సీఎంగా అనర్హుడని మండిపడ్డ పృథ్వీ …చంద్రబాబు జీవితమంతా కాపీనే అని ఎద్దేవా చేశారు. ముస్లిం ఓట్ల కోసం ఫరూక్ అబ్దుల్లాని రాష్ట్రానికి తీసుకు వచ్చారని దుయ్యబట్టారు.