30 న బ్రహ్మాండనాయక్ సాయి బాబా మూవీ రిలీజ్

404
saibaba movie
saibaba movie
- Advertisement -

శ్రీ షిర్డి సాయిబాబా మహిమల ఆధారంగా రూపోందుతున్న హిందీ చిత్రం ” బ్రహ్మాండనాయక్ సాయిబాబా ” , ప్రముఖ నటుడు మిలింద్ గునాజీ సాయిబాబా పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని గురు సాయి బాబా ఇంటర్నేషన్ బ్యానర్ పై సత్యప్రకాష్ దూబే తెరకెక్కిస్తున్నారు.. మిలింద్ గునాజీ ,కిరణ్ కుమార్ , రాజు ఖేర్ , రాజా మురాద్, అనిల్ ధావన్ , అనంగ్ దేశాయ్ , నిఖిత శర్మ ప్రధానపాత్రలు పోషిస్తున్నారు.. నార్సింగ్ యమ్.షిండే నిర్మిస్తున్ప ఈ మూవీ ట్రైలర్ లాంచ్ హైద్రాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది..పోస్ట్ ప్రోడక్షన్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 30 న విడుదల అవుతోంది..

Brahmand Nayak Sai Baba

ఈ సంధర్భంగా చిత్ర దర్శకుడు సత్యప్రకాష్ దూబే మాట్లాడుతూ ..సాయిబాబా మీద భక్తితో ఈసినిమాను తీయడానికి ముందుకొచ్చానని అన్నారు..సాయిబాబా మహిమలను ప్రస్తుతం ఉన్న యువతరానికి తెలియజేయడమే ముఖ్య ఉద్దేశ్యంగా రూపోందిస్తున్నామని తెలిపారు..ఈచిత్రంలో ప్రముఖ నటుడు మిలింద్ గునాజీ టైటిల్ పాత్రలో నటించారని..బాబా పాత్రలో ఆయన నటన అద్భుతం అని అన్నారు..ఈ చిత్రానికి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు రామ్ లక్ష్మణ్ ,సుశాంత్ శంకర్ ,సంజయ్ రాజ్ గౌరీశంకర్ సమకూర్చిన పాటలు చాలా పాపులర్ అయ్యాయని తెలిపారు..ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 30 రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు..

Brahmand Nayak Sai Baba

చిత్ర నిర్మాత నార్సింగ్ యమ్.షిండే మాట్లాడుతూ: సాయిబాబా నాకు ఇష్టమైన దైవం..అందుకే సినిమా నిర్మించడానికి ముందుకొచ్చానని అన్నారు..బాబా పాత్రలో మిలింద్ పనాజీ బాగా నటించారు..ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అందరికి నచ్చే విధంగా నిర్మించామని అన్నారు..గ్రాఫిక్స్ కూడా బాగా వచ్చాయని..ఈ నెల 30 న రిలీజ్ అవుతోన్న ఈ సినిమాను ఆదరించాలని కోరారు

ఈ కార్యక్రమంలో చిత్ర నటీమణులు నిఖిత శర్మ ,అనంగ్ దేశాయ్ ,ముఖ్యఅతిథులు సంగీత దర్శకులు బల్లెపల్లి మోహన్ ,మాయ సీతారం యాదవ్, ఆర్ సి రెడ్డి ,రమేష్ గోపి , కుమార్ యాదవ్ , టిఎన్ రాజు ,ప్రోడ్యూసర్ గణేష్ పలువురుప్రముఖులు పాల్గోన్నారు

నటీనటుటు : మిలింద్ గునాజీ ,కిరణ్ కుమార్ , రాజు ఖేర్ , రాజా మురాద్, అనిల్ ధావన్ , అనంగ్ దేశాయ్ , నిఖిత శర్మ ,బ్యానర్ :గురు సాయి బాబా ఇంటర్నేషనల్ ,కొరియోగ్రాఫర్ : పప్పు కన్నా,సినిమాటోగ్రాఫర్ : హేమంత్ శర్మ ,సంగీత దర్శకులు :రామ్ లక్ష్మణ్ , సుశాంత్ శంకర్ , సంజయ్ రాజ్ గౌరీశంకర్ ,ప్రోడక్షన్ కంట్రోలర్ : రవి వర్మ ,నిర్మాత : నార్సింగ్ యమ్. షిండే , సత్యప్రకాష్ దూబే,దర్శకత్వం : సత్యప్రకాష్ దూబే

- Advertisement -