మూడు సంవత్సరాల దువ్వాడ జగన్నాథమ్…

569
dj
- Advertisement -

రేసుగుర్రం,సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం డీజే…దువ్వాడ జగన్నాథమ్. హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించగా ఒక్క యుఎస్‌లోనే దాదాపుగా 300 లొకేషన్స్‌లో విడుదలైంది. డీజే విడుదలై నేటికి మూడేళ్లు.

విడుదలైన ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇక కథలోకి వెళ్తే…దువ్వాడ జ‌గ‌న్నాథ శాస్త్రి (అల్లు అర్జున్‌) మంచి వంటగాడు. విజ‌య‌వాడ స‌మీపంలోని స‌త్య‌నారాయ‌ణ‌పురం అగ్ర‌హారంలో ఉంటూ ఆ చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల్లో జ‌రిగే వేడుక‌ల్లో త‌న చేతి వంట‌ల రుచుల్ని చూపిస్తుంటాడు. అయితే మరోవైపు అన్యాయం చేసే వారిని టార్గెట్ చేసి చంపేస్తుంటాడు. ఇంత‌కీ శాస్త్రి డీజేగా ఎందుకు మారాల్సి వ‌స్తుంది? బ్రాహ్మ‌ణ యువ‌కుడైన శాస్త్రి హ‌త్య‌లు చేసేవ‌ర‌కు ఎందుకు వెళ్లాల్సి వ‌చ్చింది? అనేదే డీజే కథ.

కథ,కథనం పాతదే అయినా దర్శకుడు హరీష్ శంకర్ కథను డీల్ చేసిన విధానం అద్భుతం. దువ్వాడ‌ జ‌గ‌న్నాథ శాస్త్రి పాత్ర చుట్టూ అల్లిన స‌న్నివేశాలే సినిమాకి కొత్త‌ద‌నాన్ని పంచాయి. అల్లు అర్జున్ రెండు కోణాల్లో అంటే అటు అటు దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ శాస్త్రిగా, ఇటు డీజేగా ఇరగదీశాడు. ఇక పాటల్లో బన్నీ డాన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పూజా హెగ్డే ప్ర‌తి స‌న్నివేశంలోనూ గ్లామ‌ర్‌గా క‌నిపించింది.

సాంకేతికంగా సినిమా బాగుంది. దేవిశ్రీప్ర‌సాద్ పాట‌ల‌తోనూ, నేప‌థ్య సంగీతంతోనూ సినిమాకి ప్రాణం పోశారు. అయ‌నంక బోస్ కెమెరా ప‌నిత‌నం కంటికి ప‌సందైన విందులా ఉంటుంది. దిల్‌రాజు నిర్మాణ విలువ‌లు తెర‌పై అడుగ‌డుగునా క‌నిపిస్తాయి. అల్లు అర్జున్ ఇదివ‌ర‌కు చేయ‌ని ఓ కొత్త ర‌క‌మైన పాత్ర‌లో క‌నిపించ‌డం ప్రేక్ష‌కుల‌కు కూడా కొత్త‌ద‌నాన్ని పంచింది.

- Advertisement -