అన్నారం @ 2.50 టీఎంసీ

481
medigadda
- Advertisement -

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంపుహౌస్ నుంచి మోటర్ల ద్వారా ఎత్తిపోస్తున్న గోదావరి నీటితో అన్నారం బరాజ్‌లో నీటిమట్టం పెరుగుతున్నది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. దీంతో గోదావరిలోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది.

ఇప్పటివరకు అన్నారం లో 2.50 టీఎంసీ ల నీరు నిల్వ అయినట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. అన్నారం బ్యాక్ వాటర్ గోదావరిలో మంథని వరకు చేరాయని వెల్లడించారు. 1,3,4,6 నంబరు పంపులు రన్ అవుతున్నాయని…వీటి ద్వారా 9200 క్యూసెక్కుల నీరు అన్నారం చేరుతాయని వెల్లడించారు.

గోదావరిలో11200 క్యూసెక్కుల ప్రవాహాలు ఉన్నట్టు గేజ్ ద్వారా తెలుస్తోందని అధికారులు తెలిపారు. మేడిగడ్డ బరాజ్‌లో అధికారులు మొత్తం 85 గేట్లనూ మూసివేశారు. బ్యారేజిలో మెల్ల మెల్లగా బ్యాక్ వాటర్ పెరుగుతున్నది. దాదాపు 3 టీఎంసీ నీరు మేడి గడ్డ లో ఉన్నట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

- Advertisement -