ఈఎస్ఐ స్కాంలో మరో ముగ్గురి అరెస్ట్…

625
esi
- Advertisement -

ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మందుల కొనుగోలు కుంభకోణం కేసులో మరో ముగ్గురిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తేజ ఫార్మా ఎండీ రాజేశ్వరరెడ్డి, చర్లపల్లి ఫార్మాసిస్ట్ లావణ్య, వరంగల్ జేడీ ఆఫీసు ఉద్యోగి పాషాను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

ఇంతకుముందు ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి సహా మరో ఆరుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విచారణలో వీరిచ్చిన సమాచారం మేరకు నేడు మరో ముగ్గురిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

- Advertisement -