తెనాలి రామకృష్ణ @ 3 మిలియన్ వ్యూస్

500
sandeep kishan
- Advertisement -

నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ బ్యానర్‌పై యంగ్ హీరో సందీప్ కిషన్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం `తెనాలి రామకృష్ణ బి.ఎ, బి.ఎల్`. నిను వీడని నీడను నేనే వంటి డీసెంట్ హిట్ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 30 లక్షల వ్యూస్‌తో యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది.

సందీప్ సరసన హన్సిక మోత్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యపాత్రలో నటించింది. జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో నవ నిర్మాతలు అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హన్సిక లాయర్ పాత్రలో కనిపించనుంది. సాయికార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని, సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.

- Advertisement -