మిడిల్ క్లాస్ అబ్బాయి…. దుమ్మురేపాడు

284
middle class abbai
- Advertisement -

నేచురల్ స్టార్ నాని-సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ  ఎంసీఏ- మిడిల్ క్లాస్ అబ్బాయ్. దీపావళి కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్‌తో సినిమాపై అంచనాలను పెంచేసిన నాని తాజాగా టీజర్‌తో రికార్డులను బ్రేక్ చేశాడు. శుక్రవారం విడుదలైన ఈ టీజర్‌ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. 24 గంటల్లోనే 30 లక్షల వ్యూస్‌తో టాప్‌ పొజిషన్‌లో నిలిచింది.

టీజర్‌లో..నాని డైలాగులకు ప్రేక్షకుల నుంచి మంచిరెస్పాన్స్ వస్తోంది.  ఎంసీఏ అంటే ఏంటి అదేమన్నా క్వాలిఫికేషనా అని ఓ వ్యక్తి నానిని అడుగుతాడు. ఇందుకు నాని ‘కాదు మైండ్‌సెట్‌. ఎప్పుడైనా షర్ట్‌ బటన్‌ వూడిపోతే పిన్నీస్‌ పెట్టుకుని మ్యానేజ్‌ చేశావా.. మామూలు జీన్స్‌ని బ్లేడ్‌తో కట్‌ చేసి టోర్న్‌ జీన్స్‌లా కలర్‌ ఇచ్చావా.. అంతెందుకు ఎప్పుడైనా అలా రోడ్డుపై వెళుతూ బస్‌స్టాప్‌లో ఓ అందమైన అమ్మాయిని చూసి ఇద్దరు ముగ్గురు పిల్లలతో ఓ ఫ్యామిలీ ఫొటోను వూహించుకున్నావా.. ఇవన్నీ చేసుంటే తెలిసేది ఎంసీఏ అంటే ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయని’ అంటూ నాని చెప్తున్న డైలాగ్‌ ఆకట్టుకుంటోంది.

ఇక హీరోయిన్ సాయి పల్లవి ‘నువ్వు నాకు బాగా నచ్చావ్‌. ఎప్పుడు పెళ్లిచేసుకుంటావ్‌’ అని నానిని డైరెక్ట్‌గా అడగటం టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ హిట్స్ సాధించిన నాని.. ‘ఎంసీఏ’ చిత్రంలో మరో హిట్‌పై గురిపెట్టనట్టు టీజర్‌ను బట్టి ఫిక్స్ అయిపోవచ్చు.

- Advertisement -