మరో మూడు రోజులు వర్షాలు

67
- Advertisement -

ఈనెల 10 వరకు రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ద్రోణి కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తన ప్రదేశం నుంచి తెలంగాణ, విదర్భల మీదుగా పశ్చిమ మధ్య ప్రదేశ్‌వరకు కొనసాగుతుందని దీని ప్రభావంతో వర్షాలు పడతాయని తెలిపింది.

ఇక ఇవాళ నిజామాబాద్‌, నల్లగొండ, సూర్యాపేట, వికారాబాద్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. శ‌నివారం రోజు నిజామాబాద్, న‌ల్లగొండ‌, సూర్యాపేట‌, వికారాబాద్, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, నాగ‌ర్‌క‌ర్నూల్‌, వ‌న‌ప‌ర్తి, నారాయ‌ణ‌పేట‌, జోగులాంబ గ‌ద్వాల జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

- Advertisement -