అడవిని తలపించే గిన్నిస్ ‘మర్రి’

252
250 years old great banyan tree
- Advertisement -

భూమి మీద ఉన్న వృక్ష సంపదలో మర్రిది ప్రత్యేక స్థానం. అదో అద్భుతం. దాని విత్తనం ఎంతో చిన్నది. అదే ఇంతటి మహావృక్షాన్ని నిక్షిప్తం చేసుకున్నదన్న విషయం ఒక అద్భుతమనిపిస్తుంది. ఊడలు మళ్లీ భూమిలోకి వెళ్లి పాతుకుంటాయి. మర్రి చెట్టు మన జాతీయ వృక్షం. మర్రి చెట్టు ఎంత మేర విస్తరించి ఉంటాయో చెప్పడానికి ఒక్క చక్కని చారిత్రక సందర్భం చాలు. అలెగ్జాండర్ దండయాత్రకు వచ్చినపుడు ఏడు వేల సైన్యంతో ఒకే మర్రి చెట్టుకింద విడిది ఏర్పాటు చేసుకున్నాడు.

అలాంటి కోవకే చెందుతుంది కోల్‌కతాలో ఉన్న ఓ పురాతన మర్రి చెట్టు. దూరం నుంచి చూస్తే అడవిని తలపించే ఆ చెట్టును చూస్తే అబ్బురమనిపిస్తుంది. 850 సంవత్సర లెక్కల ప్రకారం ఈ చెట్టు ఊడల సంఖ్య 89, ఇవి విస్తరించిన వైశాల్యం 240 మీటర్లు. నేడు ఈ చెట్టు ఊడల సంఖ్య 3,772 కాగా, విస్తరించిన వైశాల్యం 486 మీటర్లుగా ఉంది.

ఊడలతో కూడిన ఈ చెట్టు 4.67 ఎకరాల ప్రదేశంలో విస్తరించి ఉన్నది. దీని నీడలో దాదాపు 10 వేల మంది మనుషులు నిల్చోవచ్చు. ఈ మర్రిచెట్టు ఉన్న ప్రదేశంలోనే 1787 సంవత్సరంలో ఆచార్య జగదీష్ బోస్ బొటానికల్ గార్డెన్ నెలకొల్పారు. ప్రపంచలోనే అత్యంత విశాలమైన చెట్టుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో నిలిచింది. దీని వయసు 250 సంవత్సరాలకంటే ఎక్కువే.

 250 years old great banyan tree

కొమ్మల పొడవు 24.5 మీటర్లు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ చెట్టుపై ఒక పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేసింది. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎంబ్లమ్ గా ఈ మర్రి చెట్టునే ఎంచుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో ‘తిమ్మమ్మ మర్రి మాను’ అనే ఓ మర్రిచెట్టు ఉంది. ఇండియన్‌ బొటానికల్‌ గార్డెన్స్‌ లెక్కల ప్రకారం ఇది 20 ఏండ్లపైబడిన వయసు కలది. అలాగే బెంగళూరు శివారు ప్రాంతాలలో ”దోడా అలాడా మారా” అనే పేరుతోనున్న మర్రిచెట్టు సుమారు రెండున్నర ఎకరాలలో వ్యాపించి ఉంది. గుజరాత్‌లోని కబీర్‌వాడ్‌ ప్రాంతంలో 300 ఏండ్ల వయసుపైబడిన మర్రిచెట్లు ఉన్నాయి.

- Advertisement -