23న ’24 కిస్సెస్’..

370
- Advertisement -

ఆదిత్ అరుణ్ .. హెబ్బా పటేల్ జంటగా నటించిన సినిమా ’24 కిస్సెస్’ అయోధ్య కుమార్ దర్శకత్వంలో నిర్మితమైన ఈ మూవీ టైటిల్‌ను బట్టే ఇది యూత్‌కి సంబంధించిన కథ అనీ, రోమాంటిక్‌ లవ్‌ స్టోరీ అనే విషయం అర్థమౌతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. కుమారి 21ఎఫ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా పటేల్‌కు ఈ చిత్రంపై గట్టి నమ్మకమే ఉంది. ఇక ఈ సినిమ ఈ నెల 23వ తేదీన విడుదల కానుంది.

24 kisses

ఇటీవల వచ్చిన కొన్ని ప్రేమకథా చిత్రాలు కంటెంట్ తోనే కాసుల వర్షం కురిపించాయి. అదే బాటలో ఈ సినిమా కూడా పరుగులుతీసే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ సినిమా యూత్ కి ఎంతవరకూ కనెక్ట్ అవుతుందో .. ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందో చూడాలి. ఈ మూవీ జోయ్ బారువా సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

- Advertisement -