అదిత్ అరుణ్ , హెబ్బా పటేల్ హీరో,హీరోయిన్లుగా ‘మిణుగురులు’ ఫేమ్ అయోధ్య కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 24 కిస్సెస్. సినిమాల్లో హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ బాగా పండాలంటే కిస్ సీన్లు తప్పనిసరి. కానీ ఏకంగా ‘24 కిస్సెస్’ అంటూ ముద్దుల ఉత్సవంతో నేడు థియేటర్స్‌కి వచ్చేసింది. ఈ సినిమాతో హెబ్బా మెప్పించిందా లేదా చూద్దాం…
కథ :
ఆనంద్ కుమార్ ( ఆదిత్ అరుణ్ ) చిల్డ్రన్ ఫిలిం మేకర్. శ్రీ లక్ష్మి (హెబ్బా పటేల్ ) ఆనంద్ దగ్గర ఫిలిం మేకింగ్ లో శిక్షణ తీసుకుంటుంది. ఈ క్రమంలో ఒకరి ఒకరు బాగా దగ్గర అవుతారు. సీన్ కట్ చేస్తే ఆనంద్ కు వేరే అమ్మాయిలతో సంబంధం ఉందని తెలుసుకొని అతనికి దూరంగా ఉంటుంది శ్రీలక్ష్మి. తర్వాత వీరిద్దరు ఎలా కలుస్తారు..?కథ ఎలా సుఖాంతం అయిందనేది తెరమీద చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ నటీనటులు,ఫస్టాఫ్‌లో వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు. ఆనంద్ పాత్రలో ఒదిగిపోయాడు ఆదిత్అరుణ్. నటనాపరంగానే కాదు లుక్స్ పరంగా మెప్పించాడు. సినిమాకు మరింత గ్లామర్ తీసుకొచ్చింది హెబ్బా పటేల్. రావు రమేష్ , నరేష్ తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్ :
సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ కథ. ఒక రొమాంటిక్ ప్రేమకథకు చిన్న పిల్లల సమస్యలు అనే అంశాన్ని జోడించడం ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. కథలో కొత్తదనం లేకపోవడం మరోమైనస్.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. జాయ్ బారువా సంగీతం అంతగా కనెక్ట్ కాలేదు. ఉదయ్ గుర్రాల అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకు రిచ్ లుక్‌ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సినిమా ను తెరకెక్కించడం లో అయోధ్య కుమార్ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. నిర్మాణ విలువలు పర్వాలేదనిపిస్తుంది.
తీర్పు:
మిణుగురులు లాంటి అవార్డు విన్నింగ్ సినిమాను తీసిన అయోధ్య కుమార్.. ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ 24 కిస్సెస్‌తో ప్రేక్షకుల ముందుకువచ్చారు. నటీనటులు సినిమాకు ప్లస్ కాగా కథలో కొత్తదనం లేకపోవడం మైనస్ పాయింట్. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో పర్వాలేదనిపించే మూవీ 24 కిస్సెస్.
విడుదల తేదీ : 23/11/ 2018
రేటింగ్ : 2.5/5
నటీనటులు : ఆదిత్ అరుణ్ , హెబ్బా పటేల్
సంగీతం : జాయ్ బరువ
నిర్మాత : సంజయ్ రెడ్డి
దర్శకత్వం : అయోధ్య కుమార్