- Advertisement -
గురువారం ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ భేటీ అనంతరం 24 మంది మంత్రులు తమ మంత్రి పదవులకు రాజీనామాలు చేశారు. ఈరోజు మధ్యాహ్నం ప్రారంభమైన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించిన అనంతరం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చించారు.. సీఎం జగన్ ఆదేశాల మేరకు మంత్రులంతా అక్కడికక్కడే తమ రాజీనామాలను సమర్పించారు. ఈ కేబినెట్ భేటీకి ఖాళీ లెటర్ హెడ్‌లతో వెళ్లిన మంత్రులు కేబినెట్ భేటీలోనే వాటిపైనే తమ రాజీనామాలను చేశారు. ఈ లేఖలను మంత్రులంతా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతిలో పెట్టారు. ఈ లేఖలను జగన్ గవర్నర్‌కు సమర్పించనున్నట్టు సమాచారం.
- Advertisement -