ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సప్. ఎన్నో ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చినా.. వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి. ఎప్పటికప్పుడు సరికొత్త పీచర్స్‌తో వినియోగదారులకు దగ్గరవుతున్న వాట్సాప్ తాజాగా భారతీయులకు షాకిచ్చింది. ఏకంగా 23 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించింది.
తొలగించినఅకౌంట్లలో 8 లక్షలకుపైగా వాట్సాప్ ఖాతాలను వినియోగదారుల నుంచి ఎలాంటి రిపోర్ట్స్ రాకుండానే తొలగించినట్లు స్పష్టం చేసింది. ఐటీ రూల్స్ 2021 ప్రకారం.. తాము ఈ చర్యలు తీసుకొని.. నివేదిక సమర్పించినట్లు వెల్లడించింది.
గతేడాది కేంద్ర ప్రభుత్వం ఐటీకి సంబంధించి కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. దీని ప్రకారం.. భారత్‌లో పనిచేసే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ తమ నెలవారీ నివేదికలను ఐటీ మంత్రిత్వ శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. దీంతో.. అప్పటి నుంచి ఇవి నకిలీ, స్పామ్, తప్పుడు అకౌంట్లపై కొరఢా ఝుళిపిస్తున్నాయి. నెలకు లక్షల్లో వాట్సాప్ ఖాతాల్ని బ్యాన్ చేస్తుండటం విశేషం.
ఇవి కూడా చదవండి..