తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు..

185
Gold Rate

బంగారం ధరలు వరుసగా రెండోరోజు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.590 తగ్గి రూ.53,230గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.540 తగ్గి రూ.48,800గా ఉంది.

పసిడి బాటలోనే వెండి కూడా కేజీపై ఏకంగా రూ. 6400 తగ్గి వెండి ధర రూ.60,600గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.07 శాతం తగ్గి 1906 డాలర్లుగా ఉండగా వెండి ధర ఔన్స్‌కు 0.08 శాతం తగ్గుదలతో 24.48 డాలర్లుగా ఉంది.